ఉగ్రవాదులపై చర్యలకు షరీఫ్ ఆదేశం

paks-nawaz-sharif-govt-orders-army-to-act-against-terrorists-dawn-reports

యూరీ ఉగ్ర దాడుల తర్వాత అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. నవాజ్ షరీఫ్ దేశంలోని తీవ్రవాదులపై చర్యలు తీసుకోవాలంటూ పాక్ ఆర్మీని ఆదేశించినట్లు డాన్ పత్రిక పేర్కొంది. ఇది వినడానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా నిజమే అనుకోవాలి మరి ఎందుకంటే యూరీ దాడికి బదులుగా పాకిస్థాన్‌ను దౌత్యపరంగా, ఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడులతో భారత్ ఆత్మరక్షణలో పడేసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం పాక్ ఉన్నతాధికారులతో అత్యంత రహస్యంగా జరిగిన సమావేశంలో ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ జైష్-ఇ- మహ్మద్‌తోపాటు ఇతర ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారని డాన్ పత్రిక తెలిపింది. ఇటీవల దౌత్యపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులతోపాటు ప్రపంచ దేశాలు పాకిస్థాన్‌ పట్ల ప్రదర్శిస్తున్న ఉదాసీత గురించి ఈ సమావేశంలో ఆ దేశ విదేశాంగ కార్యదర్శి అజీజ్ చౌధురీ వివరించారని పేర్కొంది. దీంతో నవాజ్ షరీఫ్ పాక్ ఆర్మీకి నిషేదిత ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టాలని సూచించారు. అంతే కాకుండా గత జనవరిలో జరిగిన పఠాన్ కోట్ దాడుల దర్యాప్తుతోపాటు ముంబై దాడులకు సంబంధించిన దర్యాప్తును కూడా పునఃప్రారంభించాలని రావల్పిండి తీవ్రవాద వ్యతిరేక కోర్టు ఆదేశించినట్లు డాన్ పత్రిక తెలిపింది. పాకిస్థాన్‌ వైఖరిలో మార్పు కోసమే చైనా మనకు మద్దతు ఇస్తుందన్న విదేశాంగ కార్యదర్శి మాటలకు సమావేశంలోని వారు నిర్ఘాంతపోయారు. పాక్ గూడచారి సంస్థ డైరెక్టర్ జనల్ రిజ్వాన్ అక్తర్, జాతీయ భద్రతా సలహాదారు నసీర్ జాన్జువా దేశంలోని నాలుగు ప్రావిన్సుల్లో పర్యటించిన ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాంతీయ శిఖరాగ్ర కమిటీలు, ఐఎస్ఐ కమాండోలతో చర్చిస్తారని ఆ పత్రిక ప్రచురించింది. పాక్‌లోని పంజాబ్ ముఖ్యమంత్రి షబాజ్ షరీఫ్, ఐఎస్ మధ్య జరిగిన సంభాషణ వివరాలను కూడా డాన్ పత్రిక రాసింది. ఈ ఆదేశాల ద్వారా షరీఫ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని షబాజ్ షరీఫ్ అమోఘమైన చర్యగా అభివర్ణించారని, తీవ్రవాదలపై చర్యలకు భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుందని ఆయన అన్నట్లు డాన్ తెలిపింది. మంగళవారం ప్రధాని నవాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ రహస్య సమావేశంలో క్యాబినెట్, ప్రావిన్సులకు చెందిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు. విదేశాంగ కార్యదర్శి అజీజ్ ఛౌధరి ప్రత్యేకంగా ఇచ్చిన ప్రజంటేషన్ ఇచ్చారు. అమెరికాతో క్షీణిస్తున్న సంబంధాల గురించి కూడా అజీజ్ ఈ సమావేశంలో వివరించారు. అలాగా చైనా కూడా జైష్-ఇ- మహ్మద్ నేత మసూర్ అజార్ అంశాన్ని పదేపదే ఎందుకు ప్రస్తావిస్తుందో ఒక్కసారి ఆలోచించాలని ఆయన అన్నారు. ఆర్మీ తరఫున ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ రిజ్వాన్ అక్తర్ దీనికి హాజరయ్యారని డాన్ పత్రిక ప్రచురించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*