ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఈనెల 14న నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభలో తమ రాజకీయ, దిశ, దశను వివరిస్తామని చెప్పారు. అనంతరం సభ నిర్వహణా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.ఆ సభలో జనసేన సిద్ధాంతాలు, తమ నాలుగేళ్ల ప్రయాణంపై, భవిష్యత్ కార్యాచరణపై వివరిస్తానని ఆయన అన్నారు. కాగా, ఈ రోజు అమరావతిలో సొంతింటి నిర్మాణం భూమి పూజ చేసిన అనంతరం పవన్ కల్యాణ్ గుంటూరుకు వచ్చారు. జనసేన సభ ఏర్పాట్ల గురించి నేతలను అడిగి తెలుసుకున్నారు. ఎల్లుండి తాను మాట్లాడనున్న సభావేదికపైకి ఎక్కి చూశారు. సభ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా తమ కార్యకర్తలకు, అభిమానులకు పలు సూచనలు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*