అవినీతి రాజ్యం

నిన్న గుంటూరు సమీపంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్, ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లే క్రమంలో భాగంగా నేడు కీలక భేటీలు జరపనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో టిడిపికి గెలుపు అంత సునాయాసం కాదని వ్యాఖ్యానించారు. గుంటూరు-విజయవాడ మధ్య ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ దినోత్సవ మహాసభలో పవన్‌ కల్యాణ్‌ తొలిసారిగా టిడిపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2014లో అనివార్యమైన పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు మద్దతిస్తే గత నాలుగేళ్లలో ప్రజలకు లభించిన ప్రయోజనాలకన్నా టిడిపి నాయకులు, కార్యకర్తలకు, నారాలోకేష్‌కు లభించిన ప్రయోజనాలే అధికంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం టిడిపి, బిజెపికి మద్దతిస్తే మీరు, మీకుటుంబ సభ్యులు ప్రజల భుజాలపై ఎక్కి సవారి చేస్తున్నారని విమర్శించారు. కర్నాటకలో గాలి జనార్ధన్‌రెడ్డికి, రాష్ట్రంలోని టిడిపి నాయకులకు తేడా ఏమిటని ప్రశ్నించారు. ఆయన గనులు దోచుకుంటే మీరు ఇసుక, మట్టి ఇతర వనరులను అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శించారు. చెన్నరులో రెండువేల కొత్త నోట్లతో పట్టుబడిన శేఖర్‌రెడ్డికీ, మంత్రి నారాలోకేష్‌కూ సంబంధాలుండటం వల్లే చంద్రబాబునాయుడిని ప్రధాని మోడీ పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. లోకేష్‌ అవినీతి చంద్రబాబుకు తెలిసి జరుగుతుందా లేక తెలియక జరుగుతుందా అని ప్రశ్నించారు. మహాసభలో మాట్లాడుతూ.. “ఏ పరిస్థితుల్లో నేను 2014లో టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చాను. మీకు పదవులు అప్పజెప్పి మీ కాళ్లతో తొక్కించుకోవడానికా?.. మీతో, మీ పిల్లలతో తొక్కించుకోవడానికా? ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తోంటే కంచె చేను మేస్తోంటే కాపరి ఏం చేయగలడు అనే సామెత గుర్తొస్తోంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని ఉద్ధృతంగా పోరాడాల్సి వస్తుంది. మేము ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోరాటం చేయం. అమరావతిలోనే, అమరావతి నుంచే దేశాన్ని ఆకర్షించేలా పోరాడతాం.ఇటీవల మన తెలంగాణ నాయకులు టీవీలో మాట్లాడుతూ అలా అన్నారు.. ప్రత్యేక హోదా పోరాటాన్ని తెలంగాణ పోరాటం జరిగినంత బలంగా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారని అన్నారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*