కమ్యూనిస్టులతో కలిసి ఉద్యమిస్తా పవన్‌

విజయవాడలోని దాసరి భవన్‌లో సిపిఎం, సిపిఐ ముఖ్య నేతలతో శుక్రవారం ఆయన సమావేశమ య్యారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామ కృష్ణలతో కలిసి పవన్‌కల్యాణ్‌ విలేకరులతో మాట్లాడు తూ బిజెపి, టిడిపి చేసిన వాగ్దానాలను విస్మరించి, రాష్ట్రాభివృద్ధిపై నిర్లక్ష్యం వహించాయని విమర్శిం చారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను నేరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెద్దఎత్తున అవినీతి పెరిగిపోతోందని పదేపదే తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానన్నారు. చేసిన తప్పులు సరిదిద్దుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. రాష్ట్రాభి వృద్ధితోపాటు ప్రజల సంక్షేమం కోసం తాను ఎంతవరకైనా వెళ్తానన్నారు. సిపిఎం, సిపిఐ, ప్రజాసంఘాల నేతలతో చర్చించి ఉద్యమ దిశా దశను నిర్ణయిస్తామని వెల్లడిం చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*