పవన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్న జనసేన

పవన్ కల్యాణ్. త్వరలోనే రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఏపీలో 175 స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పడం ద్వారా.. తమకు ఎవరితోనూ ఎన్నికల పొత్తులు ఉండబోవని ఆయన పరోక్షంగా వెల్లడించినట్లయింది. తమ పార్టీ కార్యకర్తలందరికీ రెండేసి ఎన్నికల అనుభవం ఉందని చెప్పిన పవన్.. ఎన్నికల శంఖారావం పూరించేశారు. ఈనెల మూడోవారం నుంచే ఆయన తన పర్యటనకు రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాల నుంచి పర్యటన మొదలుపెట్టి.. అక్కడినుంచి గుంటూరు జిల్లాలోని పల్నాడులోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు సమాచారం.ప్రతి జిల్లాలో క్రియాశీలక కార్యకర్తలను తయారుచేసేందుకు జనసేన రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా బస్సు యాత్రలో భాగంగా నాలుగు జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని పవన్ నిర్ణయించారు. ఆగస్టులో జనసేన పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనుంది. ఆగస్టు తర్వాత అభ్యర్థుల విషయంలోనూ పవన్ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఏపీలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తానన్న పవన్.. ఆగస్టు నెలలో తెలంగాణ నుంచి పోటీపై నిర్ణయం తీసుకుంటానని ఇటీవల ప్రెస్‌మీట్‌‌లో పవన్ క్లారిటీ చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*