పవన్ పర్యటన సందర్భంగా అపశ్రుతి..

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పర్యటనను పురస్కరించుకుని ఫ్లెక్సీలు కడుతుండగా విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై  ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.పవన్ కల్యాణ్ నేడు ఇక్కడ పర్యటించనున్నారు. దీంతో తమ అభిమాన హీరో రాకను పురస్కరించుకుని తునికి చెందిన తోళెం నాగరాజు, పాయకరావుపేటకు చెందిన శివ కలిసి స్థానిక సాయిమహల్ జంక్షన్ వద్ద స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనతో పాయకరావుపేటలో విషాదం నెలకొంది.

ఈ విషయం తెలుసుకున్న పవన్‌ కల్యాణ్‌.. ఈ విషాద వార్త తన మనసుని కలచివేసిందని తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. “టీ నాగరాజు, బీ శివల మరణం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఘటన వారి కుటుంబీకులకు ఎంత వేదన కలిగిస్తుందో అర్థం చేసుకోగలను. మృత్యువాత పడిన ఆ యువకుల కుటుంబాలను స్వయంగా కలిసి పరామర్శిస్తాను. జనసేన పార్టీ ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటుంది” అని పవన్‌ పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*