విమ్స్‌ ఆసుపత్రిని పవన్‌ పరిశీలించారు.

విమ్స్’ లో ప్రయివేటీకరణ జరుగుతుందనే ప్రచారంతో నేను ఇక్కడకు వచ్చాను.. ఆసుపత్రి అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటూ పబ్లిక్‌కు అందుబాటులో ఉండాలి.. ఇక్కడ మౌలిక వసతులు, వైద్యులు, సిబ్బంది ఖాళీల పరిస్థితి ఏమిటి? సమస్యలేమిటి? ప్రభుత్వానికి సిఫారసు చేస్తాను..’ అంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విశాఖ విమ్స్‌ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం పరిశీలించారు. వైద్యం పరిస్థితులపై పవన్‌ ఆరా తీశారు. అనంతరం విమ్స్‌ డైరెక్టర్‌ ఛాంబర్‌లో అరగంటసేపు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పవన్‌ ఆసుపత్రి బాగోగులు, వైద్య సిబ్బంది కొరత, పిపిపి అమలు, ప్రభుత్వ విధానం, ప్రజల్లో ఉండే అనుమానాలపై ప్రత్యేకించి డైరెక్టర్‌ కె.సత్యప్రసాద్‌తో చర్చించారు. బ్బంది కొరత తీవ్రంగా ఉందని పవన్‌కు డైరెక్టర్‌ సత్యప్రసాద్‌ వివరించారు. ముఖ్యంగా పవన్‌ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకు విశాఖ విమ్స్‌ నుంచి ఎలాంటి పరిష్కారం ఆశించవచ్చని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కిడ్నీ, హార్ట్‌ ట్రాన్‌రంట్‌కు వీలుగా విమ్స్‌ను అభివృద్ధి చేయాలని, ఈ విషయంలో ప్రభుత్వానికి తాను సిఫారసు చేయనున్నానని ప్రకటించారు. ఫ్రీ డయాలసిస్‌ (నెఫ్రోప్లస్‌) ఎలా జరుగుతుందో పవన్‌ చూశారు. దీంతో పలాస, టెక్కలిల్లో కిడ్నీ బాధితుల సమస్య తీవ్రమై ఇక్కడకు విచ్చేస్తే సరైన రీతిలో వైద్యం అందించాలని పవన్‌ సూచించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*