మార్పు కోసం భావజాల యుద్ధం

జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌   గచ్చిబౌలిలోని సుధా కన్వెన్షన్‌ సెంటర్‌లో సోమవారం జరిగిన మెగా అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. తనకు ఊహ తెలిసిన నాటి నుంచి తన అభిమాన హీరో చిరంజీవేనని చెప్పారు. తానెప్పుడూ హీరోనుకోలేదని, అందుకే తనకంటూ అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. చిన్నతనం నుంచి తనది శాంతి మంత్రమేనని, అయితే చిరంజీవిని ఎవరైనా చెడుగా అంటే మాత్రం కొట్టేవాడినని చెప్పారు. అందుకే తనకు స్పీడెక్కువనే పేరొచ్చిందన్నారు. సమాజంలో దోపిడీని చూస్తుంటే ఆవేదన, ఆగ్రహం వస్తున్నాయని, వివక్ష సహించలేక పోతున్నానని తెలిపారు. మార్పు కోసం భావజాల యుద్ధం చేస్తున్నట్లు పవన్‌ ప్రకటించారు. అధికారం కోసం కాకుండా, రైతులు, మహిళలు, యువత సమాజంలో అన్ని వర్గాలకు మేలు జరిగేలా మార్పునే ఆశిస్తున్నట్లు చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*