రాజధాని కోసం అవసరానికి మించి భూసేకరణ

రాజధాని నిర్మాణానికి రైతులు స్వఛ్చందంగా భూములిస్తే తీసుకోవాలి తప్ప, బలవంతంగా తీసుకోవడం తగదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.ఇకపై భూసేకరణ చేస్తే, ఎదురు తిరగాలంటూ రైతులకు పిలుపునిచ్చారు. ఈరోజు అమరావతిలోని ఉండవల్లిలో రైతులతో పవన్ భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. భూసేకరణ జరిగితే తనకు చెప్పాలని, తాను కూడా వచ్చి మీతో పాటు ఆందోళనలో పాల్గొంటానని తెలిపారు. భూములను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తే… ప్రాణాలు ఇవ్వడానికి తానే ముందుంటానని చెప్పారు. బహుళ పంటలు పండే భూములను బంజరు భూము లుగా రికార్డుల్లో చూపించడం దుర్మార్గమన్నారు. ఈ ప్రాంతంలోని రైతులకు గతంలో ఉత్తమ రైతు అవార్డులు ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు పంటలు పండటంలేదని చెప్పడం సరైంది కాదన్నారు. 120 రకాల పంటలు పండించే రైతులు, రైతు కూలీలు ఏవిధంగా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు.తమను బెదిరింపులకు గురిచేసి భూములను లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాజధాని రైతులు పవన్‌ వద్ద ఆవేదనను వ్యక్తం చేశారు. పొలానికి వెళ్లాలంటే ఆధార్‌ కార్డు అడుగుతున్నారన్నారు. రూ. 5 కోట్ల నుంచి రూ.10 కోట్లు విలువ చేసే భూమికి కేవలం రూ.30 లక్షలు ఇస్తామనడం దారుణమన్నారు. తమ భూములను సింగపూర్‌ కంపెనీలకు అమ్మే హక్కు చంద్రబాబుకు ఎక్కడదని ప్రశ్నించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*