జనసేన…. ట్రైలర్ వచ్చేసింది: సినీ స్టైల్‌లో పవన్ పార్టీ పబ్లిసిటీ

pawan-kalyan-s-jana-sena-mana-sena-trailer

పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొనసాగుతూనే రాజకీయాలు చేస్తానని, సినిమాలు మానేస్తే తనకు తిండి ఎవరు పెడతారు అంటూ ఇటీవల తన జనసేన పార్టీ తరుపున నిర్వహించిన సభల్లో పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రెండున్నరేళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టినా…. కేవలం అది అప్పుడు ఎన్నికల ముందు హడావుడి చేయడానికే పరమితం అయింది. అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ మళ్లీ జనసేన కార్యక్రమాలు, సభలతో హడావుడి మొదలు పెట్టారు. 2019 ఎన్నికలే టార్గెట్ గా పవన్ కళ్యాణ్ ఇప్పటి నుండే పార్టీని జనాల్లోకి తీసుకెళ్లడం ప్రారంభించారని టాక్. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి గ్రామ, మండల, జిల్లా, రాష్ట స్థాయిల్లో కమిటీలు వేసి క్యాడర్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండటం చూసాం. అయితే పవన్ కళ్యాణ్ జనసేన మాత్రం అలాంటి ప్రయత్నాలు కాకుండా కాస్త భిన్నంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*