‘జనసేన’…ఇదేంది వింతగా ఉంది, సినిమా స్టైలా?

pawan-kalyan-s-party-jana-sena-mana-sena-teaser

ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ టీజర్… ఇలాంటి పదాలు మనం సినిమాల విషయంలోనే విన్నాం. కానీ రాజకీయాల్లో ఇలాంటి పదాలు గానీ, పోకడలు కానీ కనిపించవు. అయితే పవన్ కళ్యాణ్ ‘జనసేన’ విషయంలో మాత్రం ఇలాంటి వింతలు కనిపిస్తున్నాయి. రెండున్నరేళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించారు. ఎన్నికల ముందు హడావుడి చేసారు. తర్వాత తన సినిమాల్లో బిజీ అయిపోయారు. ఆ మధ్య ఏపీ కొత్త రాజధాని భూసేకరణ విషయంలో అక్కడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆందోళన వంటి వాటిలో జోక్యం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో మళ్లీ పవన్ కళ్యాణ్ పార్టీ విషయంలో కాస్త యాక్టివ్ అయ్యారు. వివిధ ప్రాంతాల్లో జనసేన సభలు పెట్టి హోరెత్తించారు. సోషల్ మీడియాలో కూడా అపీషియల్ పేజీలు ఓపెన్ చేసారు. తాజాగా జన సేన మనసేన అంటూ… టీజర్ రిలీజ్ చేసారు. దీన్ని చూసిన చాలా మంది పవన్ కళ్యాణ్ పార్టీ పబ్లిసిటీ విషయంలో సినిమా స్టైల్ లో ముందుకు సాగుతుందా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న కాటమరాయుడు చిత్రం పూర్తయిన వెంటనే ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళే ప్లానింగ్ లో ఉన్నారు. ఇది పొలిటికల్ డ్రామాగా ఉంటుందని, పవన్ కళ్యాణ్ కు పొలిటికల్ మైలేజీ ఇచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*