విశాఖ చేరుకున్న పవన్‌..

జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ విశాఖ చేరుకున్నారు. పవన్‌ నగరానికి వస్తున్నారని తెలుసుకున్న జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్దఎత్తున విమానాశ్రయానికి చేరుకుని ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన సాగర్‌నగర్‌లోని సాయిప్రియ రిస్టార్ట్స్‌కు వెళ్లారు. ఈ నెల 28 నుంచి విశాఖపట్నం జిల్లాలో రెండో దశ పోరాట యాత్ర నేపథ్యంలో ఆయన నగరానికి వచ్చారు. 26, 27 తేదీల్లో రిస్టార్ట్స్‌లోనే ఉంటూ విశాఖలోని మేధావులు, విజ్ఞానవంతులు, పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. 28 నుంచి ఆరు రోజులు పాటు పోరాటయాత్రను కొనసాగించనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*