తమిళనాడులో కాటమరాయుడు..!

pawan-kalyans-katam-rayudu-at-tamil-nadu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళనాడుకి వెళ్లనున్నారు. అతను నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రం షూటింగ్ ప్రారంభమై హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్నిసన్నివేశాలను చిత్రీకరించాడు దర్శకుడు డాలీ. ఈ చిత్రషూటింగ్ లొకేషన్‌ హైదరాబాద్ నుండి తమిళనాడు కు షిప్ట్ అవ్వనుంది. ‘కాటమరాయుడు’లో కొన్నిసన్నివేశాలను తమిళనాడులోని రామేశ్వరం చిత్రీకరించాల్సి ఉండటంతో చిత్ర యూనిట్ అక్టోబర్ 5 న తమిళనాడుకు వెళ్లనుంది. ఈ షెడ్యూల్‌లో చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నటిస్తున్న శ్రుతి హాసన్ తమిళనాడు షెడ్యూల్‌తో షూటింగ్‌కి జాయిన్ అవుతుంది. ముఖ్యంగా పవన్-శ్రుతి హాసన్‌లపై కొన్ని సీన్ లను చిత్రీకరించనున్నాడు డాలీ. గబ్బర్ సింగ్ మూవీతో అభిమానులను అలరించిన పవన్-శ్రుతి హాసన్‌ల జంట మరోసారి కనువిందు చేయనున్నారు. పవన్‌కి తమ్ముళ్లుగా శివబాలాజీ, అజయ్ నటిస్తున్న విషయం తెలిసిందే. వీరిపై కూడా కొన్ని సీన్ లకు ప్లాన్ చేశాడట డాలీ. అనుప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*