పెట్రో ధరలకు నిరసనగా 5న ప్రదర్శనలు

పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నిరసిస్తూ జూన్‌ 5న ఆటో, లారీ, ట్రక్కులు తదితర రవాణా కార్మికులంతా ప్రదర్శనలు, ధర్నాలు చేయాలని ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌ఎ సుభాన్‌, ఆర్‌వి నర్సింహరావు ఒక ప్రకటనలో పిలుపు నిచ్చారు. చమురు ధరలను బిజెపి అధికారంలోకి వస్తే తగ్గిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ రూ. 44 ఉన్న పెట్రోల్‌ ధరను నాలుగు సంవత్సరాల్లో రూ.84 కి పెంచిందన్నారు. డీజిల్‌ ధరలు కూడా దాదాపు పెట్రోల్‌ ధరలకు సమానంగా పెంచు తోందన్నారు. దీంతో ప్రజా, సరుకు రవాణాలపై తీవ్ర ప్రభావం పడి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా యన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*