పెట్రోల్‌, డీజిల్‌ ధరల బాదుడు

 

దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో వరుసగా ఐదో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. దీంతో సోమవారం పెట్రోల్‌పై దాదాపు 23పైసలు, డీజిల్‌పై 22పైసలు పెరిగాయి. దీని ప్రకారం.. ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటరు రూ. 76.36కు చేరింది. ఇక దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో పెరిగిన పెట్రోల్‌ ధరలు చూస్తే.. కోల్‌కతాలో రూ. 79.03, ముంబయిలో రూ. 83.75, చెన్నైలో రూ. 79.25గా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర 16పైసలు పెరిగి రూ.80.64 గా ఉన్నది. అదేవిధంగా డీజిల్‌ ధరలు ఢిల్లీలో లీటరుకు రూ.68.07 గా ఉండగా.. కోల్‌కతాలో రూ.70.62, ముంబయిలో రూ.72.23, చెన్నైలో రూ.71.85గా ఉన్నాయి. హైదరాబాద్‌లో మాత్రం 11పైసలు పెరిగి 73.76గా ఉన్నది. దేశంలో గురువారం నుంచి పెట్రోల్‌పై 80-85పైసలు, డీజిల్‌పై 69-74పైసల వరకు ధరలు పెరిగాయి.ఆ దేశం నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్‌పై అగ్రరాజ్యం చేస్తున్న ఒత్తిడి కారణంగా చమరు ధరలు మళ్లీ పెరగడానికి కారణమయ్యాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*