భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ ప్రైజ్

physics-nobel-awarded-discoveries-on-exotic-matter

2016 సంవత్సరానికి గాను భౌతిక‌శాస్త్రంలో ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు నోబెల్ ప్రైజ్ లభించింది. ప‌దార్థానికి సంబంధించిన అసాధార‌ణ ద‌శ‌ల‌ను వెలికి తీయ‌డంలో చేసిన అధ్య‌య‌నానికి గాను డేవిడ్ దౌలస్, డంకన్ హోల్డన్, మైఖెల్ క్లోస్టర్లిజ్ లకు నోబెల్ ప్రైజ్‌ను ప్ర‌క‌టించారు. మెడిసిన్‌లో జపాన్ ప్రొఫెస‌ర్‌ యొషినోరి ఒషుమికి నోబెల్ ప్రైజ్ ప్రైజ్ మనీ కింద ప్రకటించిన మొత్తంలో సగ భాగం డేవిడ్ దౌలస్‌కు, మిగతా సగ భాగం డంకన్ హోల్డన్, మైఖెల్ క్లోస్టర్లిజ్‌లకు అందజేయనున్నట్లు మంగళవారం స్టాక్‌హోమ్‌లోని నోబెల్ క‌మిటీ ప్ర‌క‌టించింది. ప‌దార్థానికి సంబంధించి ఓ కొత్త ప్ర‌పంచాన్ని ఈ శాస్త్ర‌వేత్త‌లు ఆవిష్క‌రించార‌ని ఈ సంద‌ర్భంగా ఎంపిక క‌మిటీ ప్ర‌క‌టించింది. అత్యాధునిక గ‌ణిత‌శాస్త్ర ప‌ద్ధ‌తులు ఉప‌యోగించి ప‌దార్థానికి చెందిన సూప‌ర్ కండక్ట‌ర్స్‌, సూప‌ర్ ఫ్లూయిడ్స్‌లాంటి అసాధార‌ణ ద‌శ‌లపై వీరు అధ్య‌య‌నం చేశార‌ని క‌మిటీ ప్రకటనలో పేర్కొంది. ప్రతి ఏటా స్టాక్‌హోమ్‌లోని రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ వివిధ రంగాల్లో నోబెల్ అవార్డులను ప్ర‌క‌టిస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*