మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రభాస్‌

prabhas-be-waxed-at-madame-tussauds-museum

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… పెదనాన్న వారసత్వంతో హీరోగా తెరంగ్రేటం చేసినా, తనదైన టాలెంటుతో టాలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ దశ తిరిగిందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా స్థాయి నుండి నేషనల్ స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్. బాహుబలి సినిమా కారణంగా ప్రభాస్ ఇంటర్నేషనల్ సినీ వరల్డ్‌లో సైతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే మేడమ్ టుస్సాడ్స్ వారు ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తమ మ్యూజియంలో పెట్టాలని నిర్ణయించారు. ఇటీవలే ప్రభాస్ ను సంప్రదించి ఆయన బాడీ కొలతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సినీ పరిశ్రమకు సంబంధించి అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్. హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్ లాంటి పెద్ద స్టార్ల మైనపు విగ్రహాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. సౌత్ నుండి ఏ స్టార్ విగ్రహం అక్కడ లేదు. ఇటీవలే మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు వచ్చి ప్రభాస్ బాడీ కొలతలు తీసకున్నారు. బాహుబలి స్టైల్ లో అచ్చం ప్రభాస్ ను పోలిన మైనపు విగ్రహం బ్యాంకాక్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మనం చూడబోతున్నాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*