జగన్‌ పార్టీకి షాక్

ysr congress, mlas, assembly, privilege committee  Read more at: http://telugu.oneindia.com/news/andhra-pradesh/privilege-committee-issues-notices-12-ysrcp-mlas-186289.html

గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా విషయంలో నిరసన తెలుపుతూ అసెంబ్లీ కార్యదర్శి టేబుల్‌ పైకి ఎక్కిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ తీవ్రంగా స్పందించింది. అసెంబ్లీ ఈ విధంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా పరిగణించిన కమిటీ.. 12మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 25,26 తేదీల్లో ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. రోజుకు ఆరుగురు సభ్యుల చొప్పున హాజరవ్వవాలని ఆదేశించారు. కాగా, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ వైసీపీ సభ్యులు సభను స్తంభింపజేసిన విషయం తెలిసిందే. అంతేగాక, సభలో నిరసనలు కూడా చేపట్టారు. కాగా, ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేయడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడితే నోటీసులు జారీ ఇస్తారా? అంటూ నిలదీస్తున్నారు. కాగా, ప్రివిలేజ్ కమిటీలో వైసీపీ నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే సభ్యుడిగా ఉన్నారు. నోటీసులు జారీ అందుకున్న ఎమ్మెల్యేలు వీరే కంబాల జోగులు, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్ కుమార్, ముత్యాలనాయుడు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాడిశెట్టి రాజయ్య, కొరుముట్ల శ్రీనివాసులు, చెర్ల జగ్గిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలకు నోటీసులు జారీ అయ్యాయి. హోదా కోసమే అడ్డుకున్నాం, దేనికైనా సిద్ధం: విశ్వేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో సమావేశాలను ఏపీకీ ప్రత్యేక హోదా కోసమే అడ్డుకున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. సభా హక్కులకు భంగం కలిగించారని తమ పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారని, వాళ్లు ఏం నేరం చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఘోష, వారి భవిష్యత్ ప్రభుత్వానికి పట్టవని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోని ప్రభుత్వం.. తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు హడావుడి చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం మొత్తాన్ని సస్పెండ్ చేసినా హోదాపై పోరాటం ఆపబోమని విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*