ముఖ్యమంత్రిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

pur-cm-okram-ibobi-escapes-ambush-at-ukhrul

మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ పైన దాడి జరిగింది. ఆయన పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారని తెలిసి ఎన్ఎస్సీఎన్ (ఐఎం) క్యాడర్ అతని హెలిక్యాప్టర్ పైన కాల్పులు జరిపింది. ఈ సంఘటన ఉఖ్రుల్ జిల్లా హెడ్ క్వార్టర్లో సోమవారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో ఇధ్దరు మణిపూర్ రైఫిల్ జవాన్లకు గాయాలయ్యాయి. కాగా, ఇబోబీ సింగ్ పర్యటనకు ముందే పేలుళ్లు కూడా చోటు చేసుకోవడం గమనార్హం. ఎన్‌ఎస్‌సీఎన్‌ ఉగ్రవాదిగా అనుమానిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపాడు. ఇబోబీపై హత్యాయత్నం చేశాడు. అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. హెలీప్యాడ్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 9.30 గంటలకు ఆయన ఉఖ్రుల్‌ ఆసుపత్రి భవన ప్రారంభోత్సవానికి హెలికాప్టర్‌లో బయల్దేరారు. 10.30సమయంలో ల్యాండ్‌ అయ్యారు. తర్వాత కొన్ని నిమిషాలకే ముఖ్యమంత్రిపై కాల్పులు జరిగాయి. దీంతో సీఎం ఆయన బృందం వెంటనే ఇంఫాల్‌ బయల్దేరి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు దళాలు నిందితుడి కోసం భారీ స్థాయిలో వేటను ప్రారంభించాయి. ముఖ్యమంత్రి పర్యటనకు వారం ముందే నాలుగో ఇండియన్‌ రిజర్వు బెటాలియన్‌ పోలీసులు ఇక్కడ భద్రతకు సంబంధించిన బాధ్యతలను స్వీకరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*