తెలుగు లో సన్నీ లియోన్ సినిమా

ragini-mms-2-now-telugu-as-ratri

బాలీవుడ్‌లో బూతు సినిమాలను నిర్మించడంలో ఏక్తాకపూర్ ముందుంటారు. తాజాగా ఆమె నిర్మించిన చిత్రం “రాగిణి ఎంఎంఎస్-2”. ఈ సినిమాతో ఇపుడు బాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. అదే హారెక్స్‌. అంటే క్రైమ్‌+సెక్స్ క‌ల‌బోత‌న్నమాట‌. ఈ జాబితాలో వ‌చ్చిన ‘రాగిణి ఎంఎంఎస్-2’ సినిమా బాలీవుడ్‌లో భారీ వ‌సూళ్లు సాధించింది. సన్నిలియోన్ తన సహజ సిద్ధమైన అందాలారబోతతో పాటు భయపెట్టించే దెయ్యంగా నటించిన హిందీ చిత్రం రాగిణి ఎంఎంఎస్-2 చిత్రం రాత్రి పేరుతో తమిళం, తెలుగు భాషల్లో తెరపైకి రానుంది. గత 17 ఏళ్లుగా హిందీ చిత్ర నిర్మాణ రంగంలో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్న బాలాజీ మోషన్ పిక్చర్స్ అధినేతలు శోభాకపూర్, ఏక్తాకపూర్ నిర్మించిన తాజా చిత్రం ఇది. హిందీలో వంద కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రంలో సన్నిలియోన్ నటన ప్రధాన ఆకర్షణగా ఉంటుందంటున్నారు చిత్ర వర్గాలు. సమురాయ్ చిత్రం ఫేమ్ అనిత, పర్విన్‌దబాస్, సత్య మృదుల్, కరణ్ దలూజా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భూషణ్ పటేల్ దర్శకత్వం వహించారు. చిత్తరంజన్‌బట్, మీట్పరాయ్ అంజాన్, యో యో హనీష్, ప్రణాయ్‌రిజియా, అమర్ మోహైల్ ఐదుగురు సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని సన్నిలియోన్ నటించిన బేబీడాల్ అనే పాటను ఇప్పటికి యూట్యూబ్‌లో 4కోట్ల మంది చూశారట. ఊరికి దూరంగా ఉన్న ఒక పెద్ద బంగ్లాలో అనుమానాస్పద స్థితిలో రాగిణి (సన్నీలియోన్) “బాయ్‌ఫ్రెండ్” చనిపోతాడు. ఆ సంఘటనతో రాగిణి పిచ్చిదైపోతుంది. బాయ్‌ఫ్రెండ్ మరణానికి రాగిణి కారణం అని అందరూ నిందిస్తారు. రాగిణి మాత్రం అక్కడ ఒక దెయ్యం ఉందని చెప్తుంది. కానీ దీన్ని ఎవరూ నమ్మరు. ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని రాక్స్ అనే దర్శకుడు సినిమా తీయడానికి సిద్ధపడతాడు. ఇందులో సన్నీలియోన్‌ని హీరోయిన్‌గా పెట్టి ఆ బంగ్లాలోనే చిత్రీకరణ చేస్తుంటాడు. అక్కడ దెయ్యం ఉందా? లేదా? ఆ బంగ్లాలో ఉంటున్న “సన్నీలియోన్” చిత్ర విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తుంది? అన్న ప్రశల చుట్టూ సినిమా తిరుగుతూంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*