రైతులతో రాహుల్ డేట్..ట్రాఫిక్ ఆంక్షలు

rahul-date-with-farmers-in-delhi-may-hit-the-traffic

ఉత్తర్ ప్రదేశ్ లో రైతు యాత్రలు విజయవంతంగా ముగించుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీ రోడ్ షోలో పాల్గొననున్నారు. ఢిల్లీలోని గ్రామీణ ప్రాంతాల్లో (యూపీకి దగ్గరగా ఉన్న ఊళ్లు) రాహుల్ నేడు పర్యటించనున్నారు. రైతులతో సమావేశం కానున్నారు. రాహుల్ రైతు సభల సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేయాలని కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పోలీసులను కోరారు.
దీంతో ఘజియాబాద్ లోని హన్సన్ పూర్ చౌక్, కర్కరిమోర్ చౌక్, లక్ష్మీ నగర్, రాజ్ ఘాట్, బైరాన్ మందిర్, పార్లమెంటు వీధి, మథురా రోడ్ లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నాం రెండు గంటల నుంచి ప్రారంభమయ్యే రాహుల్ రోడ్ షో, రైతు సభలు రాత్రి వరకు కొనసాగుతాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఏర్పాటు చేసిన రైతు సభల్లో రాహుల్ ఐదు నుంచి పది నిమిషాలకంటే ఎక్కువ గడపడటం లేదని ఆయన రోడ్ షో షెడ్యూల్ చూస్తే అర్థమవుతుంది. ఘజీయాబాద్ లోని హన్సన్ పూర్ లో ప్రారంభమయ్యే ఆయన ర్యాలీ బైరాన్ రోడ్ లో ముగుస్తుంది. ఇప్పటికే దసరా పండగ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు వెళ్లే జనంతో ఢిల్లీ వీధులన్నీ సాధారణ పరిస్థితుల కంటే ఇప్పుడు మరింత రద్దీగా మారిపోయాయి. రాహుల్ పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేయడం, రూట్ మళ్లింపులు చేపట్టడం ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పడం లేదని పోలీసులు వాపోతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*