48 గంటల వర్షాలకు అవకాశం!

అరేబియన్‌ సముద్రంలో కేంద్రీకృతమైన వాయుగండం వల్ల రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండి) బుధవారం తెలిపింది.    అల్పపీడ ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించారు. మహారాష్ట్ర, కేరళ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలకు అవకాశాలు ఉన్నాయని అన్నారు. కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు అధికంగా, వేసవి తాపాన్ని ఈ వర్షాలు కొంతమేరకు తగ్గిస్తాయని అంచనా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*