ఏం చేసాడో తెలుసా? రామ్ చరణ్..

ram-charan-about-sahi-team

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి వారసత్వాన్ని వందకు వంద శాతం పునికి పుచ్చుకున్నారు. కేవలం ఆయన నుండి నట వారసత్వాన్నే కాకుండా…. ఇతరులకు సహాయం చేసే మంచి గుణాన్ని కూడా అందిపుచ్చుకున్నారు. తాజాగా రామ్ చరణ్ ఇద్దరు చిన్నారులకు సహాయం చేసారు. పుట్టుకతోనే వినికిడి సమస్య ఉన్న ఇద్దరు చిన్నారులకు ఆపరేషన్ కోసం తనవంతు సపోర్టు ఇచ్చారు. అపోలో ఆసుపత్రిలో డాక్టర్ ఈసీ వినయ్ కుమార్ నేతృత్వంలో చిన్నారులకు ఆపరేషన్ జరుగగా… రామ్ చరణ్ ఫండింగ్ ఇచ్చినట్లు సమాచారం. వారికి వినికిడి శక్తిని ప్రసాధించిన డాక్టర్ ఈసీ వినయ్ కుమార్ అండ్ టీంకి రామ్ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. రామ్ చరణ్ నేను చాలా సంతోషపడ్డ రోజు ఇది. ఈ చిన్నారులకు పుట్టుకతోనే వినికిడి సమస్య. కానీ ఇఫ్పుడు మనందరిలా వారూ వినగలరు. సాహి టీం.. డా.ఇ.సి వినయ్ కుమార్ లకు థాంక్స్. మనలో చాలా మందికి వినికిడి సమస్య ఉండదు కాబట్టి దాని విలువ పెద్దగా తెలియదు. కానీ దాని విలువ ఏమిటో ఈ పిల్లల మొహాల్లో ఆనందం చూసిన తర్వాత అర్థమైంది అంటూ రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*