నేటి నుంచి రామ్‌చరణ్‌ సినిమా చిత్రీకరణ

పోలవరం మండలంలోని శివగిరి, సిరివాక గ్రామాల మధ్య వేసిన సెట్‌లో శనివారం నుంచి సినీ కథనాయకుడు రామ్‌చరణ్‌ నటించే చిత్రంలోని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 15 రోజుల పాటు జరిగే చిత్రీకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సుకుమార్‌ దర్శకత్వరంలో మైత్రీ మూవీస్‌ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌తో పాటు కథానాయికగా సమంత నటిస్తోందన్నారు. బందోబస్తు నిమిత్తం చిత్ర బృందం శుక్రవారం పోలవరం పోలీసులను ఆశ్రయించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*