9 ఏళ్ల బాలికపై అత్యాచారం

గుంటూరు  జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు 9 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్తానని చాక్లెట్లు, బిస్కెట్స్ ఇప్పించి రిక్షాలో ఎక్కించుకున్న కిరాతకుడు బాలికను తన ఇంట్లో బంధించి అతికిరాతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక ఇంట్లో తల్లిదండ్రులు లేరు. తీవ్ర రక్తస్రావంతో భోరున విలపిస్తూ ఇంటికి చేరుకున్న బాలికను కుటుంబీకులు, బంధువులు ఏమైందని అడగ్గా విషయం చెప్పింది.బాధిత బాలిక తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బుధవారం అర్ధరాత్రి వరకు దాచేపల్లి, అద్దంకి, నార్కెట్ పల్లి రోడ్డుపై హంగామా సృష్టించారు. జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగి రోడ్డుపైనే టైర్లు కాల్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిందితుడు సుబ్బయ్యను పట్టుకొని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు ఎదురుతిరుగడంతో మరింత ఉద్రిక్తత నెలకొంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*