అనుబంధాల వేడుక!

నాగచైతన్య కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున అక్కినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రారండోయ్ వేడుక చూద్దాం అనే పేరును ఖరారు చేశారు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. దర్శకుడు కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ అనుబంధాలు, ఆప్యాయతలకు దర్పణంలా నిలిచే అందమైన కుటుంబ కథా చిత్రమిది. గ్రామీణ నేపథ్యంలో సున్నితమైన భావోద్వేగాల సమాహారంగా సాగుతుంది. నాగచైతన్య పాత్ర వినూత్నంగా ఉంటుంది.

నటుడిగా ఆయనను సరికొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. రకుల్‌ప్రీత్‌సింగ్ గ్లామర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగచైతన్య కెరీర్‌లో మంచి సినిమా అవుతుందనే నమ్మకముంది. 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్ నెలాఖరు వరకు సాగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. జగపతిబాబు, సంపత్, కౌసల్య ఇర్షాద్, చలపతిరావు, అన్నపూర్ణ, పృథ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే: సత్యానంద్, సినిమాటోగ్రఫీ: ఎస్.వి. విశ్వేశ్వర్, ఎడిటింగ్: గౌతంరాజు, నృత్యాలు: రాజు సుందరం, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఆర్ట్: సాహి సురేష్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*