రవివర్శ దమయంతి చిత్రానికి 11 కోట్లు

న్యూయార్క్: ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ కుంచె నుంచి జాలువారిన ఓ అపురూప చిత్రానికి భారీ ధర పలికింది. ఆయన గీసిన దమయంతి చిత్రం వేలంలో రికార్డుస్థాయిలో రూ.11.9 కోట్లకు అమ్ముడుపోయింది. న్యూయార్క్‌లోని సోతొబే యాక్షన్ హౌస్‌లో దక్షిణాసియా సమకాలిన, ఆధునిక చిత్ర కళాప్రదర్శన, యాక్షన్ నిర్వహించారు. ఇక్కడ పెట్టిన రవివర్మకు చెందిన ఒకే పెయింటింగ్ రెట్టింపు ధరకు విక్రయమైంది. వాస్తవానికి ఈ చిత్రానికి రూ.4.58 కోట్లకు వస్తాయని నిర్వాహకులు అంచనావేశారు. కానీ, ఊహించిన దానికంటే రెట్టింపు ధర పలికింది. నల దమయంతి నాటకంలోని ఓ సన్నివేశం ఆధారంగా చేసుకొని ఈ దమయంతి చిత్రాన్ని రవివర్మ గీశారు. 20 శతాబ్దానికి చెందిన రవి వర్మను భారత ప్రభుత్వం 1979లో జాతీయ నిధిగా ప్రకటించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*