1న బ్యాంకులకు సెలవు

ముంబై : ఈ శనివారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు సెలవు పాటించనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలిరోజు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల శాఖలను తెరిచివుంచాలన్న గతంలో జారీచేసిన ఆదేశాలను రిజర్వు బ్యాంక్ వెనక్కి తీసుకున్నది. ప్రభుత్వాలకు సంబంధించి చెల్లింపుల విషయంలో ఎలాంటి అవంతరాలు తలెత్తకుండా మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకు అన్ని రోజులు(శనివారం, ఆదివారం, అన్ని రకాల సెలవు దినాల్లో) తెరిచివుంచాలని ఆర్‌బీఐ గతవారంలో ఆదేశాలు జారీచేసింది. అయితే ప్రస్తుతం ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంటు మరో సర్క్యూలర్‌ను బుధవారం జారీచేసింది. ఖాతాల వార్షిక ముగింపు సందర్భంగా ప్రతి ఏడాది ఏప్రిల్ 1న బ్యాంకులు మూసివేసివుంచుతారు. ఆర్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో వచ్చే శనివారం బ్యాంకు శాఖలు తెరిచి ఉంచాల్సిన అవసరం లేదని, ఒకవేళ తెరిచి ఉంచితే ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఆటంకం కలుగుతుందని, ముఖ్యంగా విలీనమయ్యే బ్యాంకులపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతుందని ఆర్‌బీఐ పేర్కొంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*