అటు ఇటు అయిన రిలీజ్ డేట్స్

సమ్మర్ సీజన్ లో వరుస సినిమాలు విడుదల చేయడం ఓ ఆనవాయితీగా వస్తుంది. ఈ సారి సమ్మర్ మాత్రం బడా సినిమాలతో ఫుల్ సందడిగా మారనుంది. మార్చి చివరి వారంలో కాటమరాయుడు సందడి చేయనుండగా ఏప్రిల్ మొదటి వారంలో కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తాయని మొదట చెప్పుకొచ్చారు. కాని కొన్ని కారణాల వలన ఏప్రిల్ మొదటి వారంలో విడుదలయ్యే సినిమాల సంఖ్య తగ్గుతూ వస్తుంది.

ఏప్రిల్ 7న వెంకీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గురు చిత్రంతో పాటు వర్మ క్రేజీ ప్రాజెక్ట్ సర్కార్ 3, మణిరత్నం ప్రేమ కథా చిత్రం చెలియా, మోహన్ లాల్, అల్లు శిరీష్ ప్రధాన పాత్రలలో రూపొందిన 1971: భారత సరిహద్దు చిత్రాలు విడుదలవుతాయని చెప్పుకొచ్చారు. కాని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నందున సర్కార్ 3 చిత్రాన్ని మే 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇదిలా ఉంటే గురు చిత్రం వారం ముందుగానే విడుదలయ్యేందుకు సిద్ధమైందట. మార్చి 31న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు. మరి మార్చి 29న రోగ్ వస్తుందని తెలుస్తుండగా, 31కి నయనతార డోర చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాలు వెంకీకి అంత పోటి ఇవ్వకపోవచ్చని అంటున్నారు. ఇక చెలియా చిత్రం ఏప్రిల్ 17కి పోస్ట్ పోన్ అయిందనే టాక్ వినిపిస్తున్న దీనిపై క్లారిటీ లేదు. 1971: భారత సరిహద్దు అనే చిత్రం మాత్రం ఏప్రిల్ 7నే పక్కా విడుదలయ్యేందుకు ఫిక్స్ అయింది. మరి ఈ తేదీల మార్పుతో అభిమానులలో కాస్త గందరగోళం నెలకొనడం ఖాయం అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*