టెక్సాస్‌లో ఘోర రోడ్డుప్రమాదం

టెక్సాస్‌: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 12మంది మృతి చెందారు. ఒక మినీ బస్సును పికప్‌ ట్రక్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెక్సాస్‌లోని శాన్‌ ఆంటోనియో పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలోని గార్నర్‌ స్టేట్‌ పార్క్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టెక్సాస్‌లోని న్యూబ్రౌన్‌ఫెల్స్‌కు చెందిన ఫస్ట్‌ బాప్టిస్ట్‌ చర్చికి సంబంధించిన 14మంది వృద్ధులు ఒక వేడుకలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉండగా పికప్‌ ట్రక్‌ ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం ఎవరికీ తెలియలేదు. పికప్‌ ట్రక్‌లో డ్రైవర్‌ ఒక్కడే ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక న్యూస్‌చానల్‌ వాహనం ఈ ప్రమాదాన్ని తొలుత గుర్తించింది. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. టెక్సాస్‌ గవర్నర్‌ గ్రేజ్‌ అబాట్‌ మృతులకు సంతాపం తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*