చీమ కుట్టినట్లుగా కూడా లేదు: చంద్రబాబుపై తీవ్ర విమర్శ చేసిన రోజా

roja-fires-on-chandrababu-naidu-over-mannavaram-project

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ నుంచి మన్నవరంలోని భెల్ ప్రాజెక్ట్ మరో రాష్ట్రానికి తరలిపోతున్న చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదని ఆమె ఆరోపించారు. భెల్ ప్రాజెక్ట్‌ని శ్రీకాళహస్తిలోనే నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి తిరుపతిలో చేపట్టిన దీక్ష శనివారంతో రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రోజా దీక్ష స్థలి వద్దకు చేరుకుని సంఘీభావం ప్రకటించారు. శ్రీకాళహస్తిలోని మన్నవరం ప్రాజెక్టు చేపట్టాలని వైసీపీ నేత బియ్యపు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. తీర ప్రాంతంలో ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించకపోతే పోరాటాలు తప్పవని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. తన నియోజకవర్గంలోని మండలంలో నూతనంగా నిర్మించిన పాఠశాల అదనపు గదులు, పలు సిమెంట్‌ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల నుంచి పరిశ్రమల యాజమాన్యాలు భూములను తీసుకున్న సమయంలో ఇచ్చిన హామీలను మరవకూడాదని ఆయన హెచ్చరించారు. పరిశ్రమల స్థాపన పేరుతో రైతుల వద్ద నుంచి భూములు తీసుకున్న యజమానులు విద్యార్హతల పేరుతో స్థానిక యువతకు ఉపాధి కల్పించపోతే పోరాటం చేస్తామన్నారు. సామాజిక బాధ్యతగా వినియోగించాల్సిన సీఎస్సార్‌ నిధులను పరిశ్రమలు స్థానిక గ్రామాల అభివృద్ధికే కేటాయించాలని డిమాండ్ చేశారు. పెద్దల మెప్పు కోసం ఇతర ప్రాంతాల్లో అనవసరపు కార్యక్రమాలకు వినియోగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*