రాయ్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక

రూ.5 వేల కోట్లు డిపాజిట్ చేయకపోతే అంబీ వ్యాలీని వేలంవేస్తాం..
న్యూఢిల్లీ : సహారా గ్రూపు చైర్మన్ సుబ్రతారాయ్‌కు సుప్రీంకోర్టు మరో షాకిచ్చింది. బెయిల్ పొడిగించేందుకు డిపాజిట్ చేయాల్సిన దాదాపు రూ.5 వేలకోట్లను సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో బదులుగా స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఖాతాల్లో జమ చేయాలని సూచించింది. గడువులోగా డబ్బు డిపాజిట్ చేయలేకపోతే..సహారాకు చెందిన రూ.30 వేల కోట్ల విలువైన అంబీ వ్యాలీని వేలం వేస్తామని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ హెచ్చరించింది. రాయ్ పెరోల్ గడువును ఏప్రిల్ 17 వరకు పొడిగిస్తూ గత నెలలో అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ పొడిగించేందుకు రూ.5,092.6 కోట్ల మొత్తాన్ని ఏప్రిల్ 17లోగా డిపాజిట్ చేయాలని గ్రూపును ఆదేశించింది. వచ్చే రెండు వారాల్లో ఆధీనంలో లేని ఆస్తుల జాబితాను సమర్పించాల్సిందిగా సహారాను కోరింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*