‘టెర్రరిస్థాన్’ చర్యలను ఖండించిన రష్యా

russia-backs-india-on-surgical-strikes

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ జరపడాన్ని రష్యా సమర్ధించింది. పాకిస్థాన్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని భారత్ లో ఉంటున్న రష్యా రాయబారి అలెగ్జాండర్ ఎం.కదాకిన్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనెలా పాక్ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. రష్యా ఎప్పుడూ భాతర్ తో మైత్రీ కొనసాగిస్తుందని చెప్పారు.
‘భారత్ పై పాకిస్థాన్ తీవ్రవాదుతో దాడులు చేయిస్తూ మానవ హక్కులను ఉల్లంఘిస్తోంది. భారత్ జరిపి జర్జికల్ స్ట్రయిక్స్ ను మేం స్వాగతిస్తున్నాం. తనను తాను రక్షించుకునే హక్కు ప్రతి దేశానికి ఉంది’ అని గుర్తు చేశారు. రష్యా-పాకిస్థాన్ మిలటరీ ఒప్పందం వల్ల భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పిన కదాకిన్…తీవ్రవాదాన్ని అంతమొందించడమే తమ ధ్యేయంగా ఉండాలని ఆయన సూచించారు. ‘ఇండియాపై టెర్రర్ దాడులకు పాల్పడవద్దని పాకిస్థాన్ ఆర్మీకి మేం చెబుతాం’ అని కదాకిన్ హామీ ఇచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*