రష్యా మాకు పాత ఫ్రెండ్: ప్రధాని మోదీ

russia-is-our-old-friend-reiterates-pm-modi-at-brics-summit

బ్రిక్స్ సభ్యదేశాలతో దౌత్య సంబంధాలు మరింత దృఢంగా ఉండేందుకు తమవంతుగా కృషి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బ్రిక్స్ దేశాల ఎనిమిదవ సదస్సు శనివారం గోవాలో ప్రారంభమైంది. మోదీ ప్రారంభ ఉపన్యాసం చేశారు.
రష్యా తమకు పాత ఫ్రెండ్ అ చెప్పిన మోదీ…ఆదేశంతో కలిసి పారిశ్రామిక అభివృద్ధికోసం కృషి చేస్తామని చెప్పారు. ఇరు దేశాల మధ్య పారిశ్రామిక, మిలటరీ, సాంకేతి రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు.
రక్షణ, పౌర అణు ప్రాజెక్టుల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని భారత్-రష్యాలు ప్రకటించాయి. రూ72800 కోట్లతో రాన్సెఫ్ట్ కన్సార్టియంతో చమురు నిల్వల రిఫైనరీ, ఇతర రిటైల్ రంగంలో పెట్టుబడులు కొనసాగుతాయని రష్యా వెల్లడించింది. రూ.13,300కోట్ల వ్యయంతో వదినర్ పోర్టు అభివృద్ధి కోసం వినియోగిస్తామని పేర్కొంది. ‘సరిహద్దుల్లో భారత్‌ టార్గెట్‌గా ఉగ్రవాదులు దాడులు చేయడాన్ని ఖండిస్తూ రష్యా మాపై ఉన్నందుకు ధన్యవాదాలు. రష్యా-భారత్ సంబంధాలు ప్రపంచానికి సరికొత్త పంపినట్లు అయ్యింది. రష్యాకు చెందిన గ్యాస్, ఆయిల్ కంపెనీల్లో నాలుగు నెలల కాలంలో ఇండియా 5.5 బిలియన్లు కేటాయింది. ఆర్థికావృద్ధికోసం రష్యాతో సంబంధాలు కొనసాగిస్తాం. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేత అయ్యేందుకు భవిష్యత్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ కమిషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య కమోవ్ 200 యుద్ధవిమానాలను భారత్ లో తయారు చేసేందుకు ఒప్పందం కుదిరింది. రష్యా సహకారంతో మరో అణువిద్యుత్ కర్మగారం భారత్ లో (ఆంధ్రప్రదేశ్) ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
ఎస్-400 యుద్ధవిమానాల సరఫరాపై ఒప్పందం జరిగింది. నాగపూర్, సికింద్రాబాద్, హైదరాబాద్ ల మధ్య రైల్వేలు వేగం పెంచేందుకు వినియోగించే ఆధునికతకు రష్యా సాంకేతిక పరిజ్ఞానం అందించనుంది.హరియానాలో స్మార్ట్ సిటీల నిర్మాణంలో రష్యా తన సహకారం అందిస్తోంది.
వీటితో మొత్తం 16 కీలక అంశాలపై రష్యా-భారత్ లు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*