రష్యా సంచలన ప్రకటన

russian-media-claims-third-world-war

మూడో ప్రపంచ యుద్దం తప్పదంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపుతున్నాయి. ‘ది సన్’ అనే రష్యా ప్రముఖ పత్రిక ద్వారా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడైంది. ఏ క్షణమైనా యుద్దం జరిగే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా రష్యన్లంతా మాతృదేశానికి వచ్చేయాలని పుతిన్ పిలుపునిచ్చారని పత్రిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మూడో ప్రపంచయుద్ధానికి దారి తీయవచ్చుననే అభిప్రాయాన్ని పుతిన్ వెల్లడించినట్లుగా పత్రిక తెలిపింది. ఒకవేళ రష్యన్లు ఎవరైనా మాతృదేశానికి రావడానికి నిరాకరిస్తే.. భవిష్యత్తులో వారు స్వదేశంలో ఉద్యోగం చేసే అర్హత కోల్పోతారని హెచ్చరించినట్లుగా సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*