సచిన్‌ సినిమాకు ఆసీస్‌లో ప్రచారం

దిల్లీ: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సచిన్‌- ఏ బిలియన్‌ డ్రీమ్స్‌’. ఈ చిత్రంలో సచిన్‌ తన పాత్రలో తానే నటిస్తున్నాడు. 2017 మే 26న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసందే.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని క్రికెట్‌, సచిన్‌ అభిమానులు సచిన్‌-ఏ బిలియన్‌ డ్రీమ్స్‌ చిత్రంపై ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా నటుడు మనూ సింగ్‌తో పాటు అభిమానులు సచిన్‌ సినిమాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. మేలో విడుదల కానున్న ‘సచిన్‌-ఏ బిలియన్‌ డ్రీమ్స్‌’ చిత్రానికి ప్రచారం నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందని మనూ సింగ్‌ సోషల్‌మీడియాలో పేర్కొన్నారు.

సచిన్‌ స్పందన
మనూ సింగ్‌ నిర్వహిస్తున్న ప్రచారం గురించి తెలుసుకున్న మాస్లర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ సోషల్‌మీడియాలో స్పదించారు. తనపై ఇంత అభిమానం, ప్రేమ చూపుతున్న అందరికీ ఈ సందర్భంగా సచిన్‌ ధన్యవాదాలు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*