పవన్ ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ తో

సందీప్ రెడ్డి వంగాకు సహజంగానే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మైత్రీ మూవీస్ వారు తమ బ్యానర్లో ఒక సినిమా చేసి పెట్టమంటూ, సందీప్ రెడ్డికి 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక పవన్ కల్యాణ్ తోను ఈ దర్శకుడు ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందనేది ఫిల్మ్ నగర్ టాక్. ‘అర్జున్ రెడ్డి’ హిట్ టాక్ వచ్చినప్పుడే పవన్ నుంచి సందీప్ కి ఫోన్ కాల్ వెళ్లిందట. మంచి కథ రెడీ చేయమని పవన్ చెప్పాడని అంటున్నారు. ఆ తరువాత పవన్ కలిసిన సందీప్ ఒక లైన్ వినిపించగా ఆయన ఆసక్తిని చూపించాడని చెబుతున్నారు. ఆ లైన్ ను డెవలప్ చేసుకుని రమ్మని చెప్పాడని అంటున్నారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*