సానియా జోడీ అవుట్‌

బీఎన్‌పీ పారిబస్‌ ఓపెన్‌ 

కాలిఫోర్నియా: డబ్ల్యూటీఏ బీఎన్‌పీ పారిబస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో సానియా మీర్జా-బార్బరా స్ర్టికోవా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీ కథ ముగిసింది. మంగళవారం రాత్రి జరిగిన క్వార్టర్స్‌ పోరులో నాలుగో సీడ్‌ సానియా-స్ర్టికోవా జోడీ 4-6, 4-6తో వరుస సెట్లలో మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌)-యెంగ్‌ జెన్‌ (చైనీస్‌ తైపీ) ద్వయం చేతిలో పోరా డి ఓడింది. ఈ మ్యాచ్‌ గంటా 20 నిమిషాల పా టు హోరాహోరీగా సాగింది. సానియా ద్వయం 4 డబుల్‌ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకుంది.
 

ప్రీ క్వార్టర్స్‌లో ఫెడరర్‌ X నడాల్‌: పురుషుల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో రోజర్‌ ఫెడరర్‌, రఫెల్‌ నడాల్‌ తలపడనున్నారు. మూడో రౌండ్‌లో తొమ్మిదో సీడ్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) 7-6 (3), 7-6 (4)తో జాన్సన్‌ (అమెరికా)పై గెలిచాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్‌ నడాల్‌ (స్పెయిన్‌) 6-3, 7-5తో సహచర ఆటగాడు ఫెర్నాండో వెర్డాస్కోపై గెలిచాడు. ఐదుసార్లు టోర్నీ విజేత నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 7-5, 4-6, 6-1తో డెల్‌పొట్రో (అర్జెంటీనా)పై నెగ్గాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*