‘సర్దార్’పై జోకులేస్తే మీ పని ఖతం

sardar-jokes-stereotype-sikhs-as-silly-or-intellectually-inferior-should-be-treated-as-ragging

కాలేజీల్లో చదువుకునే సీనియర్లు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా వినండి. లేకపోతే తేడాలొచ్చేస్తాయి. పొరపాటున నోరు జారారో ర్యాగింగ్ కేసు బుక్కవుతుంది. ఇదంతా దేనికి అనుకుంటున్నారా అయితే ఇది చదవండి పాఠశాలల్లోనూ, కాలేజీల్లోనూ శిక్కు విద్యార్థులపై ద్వంద్వార్థ పదాలు, కుళ్లు జోకులు వేస్తే ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి మరి లేకపోతే ర్యాగింగ్ కేసు నమోదై జైలుకు వెళ్లే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి హెచ్ఎస్ బేడీ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ సిఫార్సులు చేసింది. అంతే కాకుండా శిక్కుల గురించి వ్యగ్యంగా రాసిన వెబ్‌సైట్‌ల లైసెన్స్‌లను రద్దు చేయాలని, వీరిని కించపరుస్తూ తీసిన సినిమాలను బ్యాన్ చేయాలని కూడా కమిటీ సూచించింది. పనిచేసే చోట, ప్రాథమిక పాఠశాలల్లో శిక్కు సమాజం ఎదుర్కొంటున్న అవమానాలను అధ్యయనం చేయడానికి జస్టిస్ బేడీ అధ్యక్షతన ఓకమిటీని డిల్లీ శిఖ్ గురుద్వార్ మేనేజ్‌మెంట్ కమిటీ నియమించింది. దీనికి సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు బేడీ శుక్రవారం సమర్పించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ బెంచ్ విచారణ చేపట్టింది. సామాజిక మాద్యమాలతోపాటు సమాజం కూడా శిక్కుల గౌరవానికి భంగం వాటిల్లేలా జోకులు ప్రచారం చేస్తున్నాయని న్యాయవాది హర్వీందర్ చౌదురి, డీఎస్జీఎంసీ కోర్టుకు తెలియజేశాయి. అంతే కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం శిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కోర్టులో తమ వాదనలు వినిపించారు. దీనివల్ల వ్యతిరేక భావాలు ఏర్పడి ఒక్కోసారి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తాయని ప్యానల్ అభిప్రాయ పడింది. అలాగే కేంద్ర సమాచార, ప్రసార శాఖకు కూడా శిక్కుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్‌సైట్స్, సినిమాలను నిషేధించాలని కూడా కోరింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*