ఆస్ట్రేలియన్ విజేత వెటెల్

మెల్‌బోర్న్: రేసు ఆఖరి క్షణాల్లో అద్భుతంగా కారును నడిపిన ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్.. ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన 57 ల్యాప్‌ల ప్రధాన రేసును వెటెల్.. గంటా 24 నిమిషాల 11.672 సెకన్లలో ము గించి అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో 25 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. పోల్ పొజిషన్‌తో రేసును ఆరంభించిన మెర్సిడెజ్ డ్రైవర్ హామిల్టన్ 10 సెకండ్ల తేడాతో రెండోస్థానానికి పరిమితమయ్యాడు. బొటాస్ (మెర్సిడెజ్), రైకోనెన్ (ఫెరారీ), వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), మసా (విలియమ్స్) వరుసగా మూడు నుంచి ఆరుస్థానాల్లో నిలిచి పాయింట్లు సాధించారు. క్వాలిఫయింగ్‌లో విఫలమైనా ప్రధాన రేసులో మాత్రం ఫోర్స్ ఇండియా సత్తా చాటింది. సెర్గి పెరెజ్ ఏడు, స్టెబాన్ ఒకాన్ పదో స్థానంలో నిలిచి వరుసగా ఆరు, ఒక పాయింట్లను గెలిచారు. ఫోర్స్ ఇండియాతోనే ఫార్ములావన్‌లో అరంగేట్రం చేసిన ఒకాన్‌కు ఇదే మొదటి పాయింట్ కావడం విశేషం. ఆఖర్లో పోటీకి వచ్చిన రెండుసార్లు ప్రపంచ చాంపియన్ ఫెర్నాండో అలోన్సోను వెనక్కి నెట్టడంలో ఒకాన్ చురుకుగా వ్యవహరించాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*