షబానా ఫైర్, అజయ్ విచారం

shabana-azmi-slams-maharashtra-cm-buying-patriotism-from

యురి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్, భారతదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీని ప్రభావం బాలీవుడ్‌పై కూడా పడింది. పాకిస్తాన్ ఆర్టిస్టుల పనిచేసిన సినిమాలను ఆడనివ్వబోమంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సంస్థ (ఎంఎన్ఎస్) హెచ్చరించడంతో దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ తెరకెక్కించిన ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ చిత్రానికి అవాంతరాలు వచ్చాయి. అయితే ఆ ఆటంకాలను అధిగమించి చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. కరణ్ జోహర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పడ్నవీస్ సమక్షంలో చర్చలు జరిపి చిత్రం విడుదలకు మార్గం సుగమం చేసుకున్నారు. ఇక ముందు తన సినిమాల్లోకి పాక్ ఆర్టిస్టులను తీసుకోబోనని ఆయన చెప్పారు. ఆ చిత్రం విడుదలకు ఏర్పడిన ఆటంకాలపై, సినిమా రంగంలోకి రాజకీయాలు ప్రవేశించడంపై బాలీవుడ్ ఆర్టిస్టులు స్పందిస్తున్నారు. రాజకీయ నాయకులు మాత్రం బాలీవుడ్‌పై ఆ ఆంక్షలు పెట్టడానికే ముందుకు వస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*