ఇంద్రకీలాద్రిపై తప్పిన పెను ప్రమాదం

short-circuit-occurs-at-indrakiladrivijayawada

కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అలంకరణ నిమిత్తం వేలాడదీసిన విద్యుత్ బల్పుల వరసలో ఆదివారం ఉదయం షార్ట్ సర్య్కూట్ సంభవించింది. దీని కారణంగా ఆలయ పరిసరాల్లో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలు ఆర్పివేశారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది.కాసేపు విద్యుత్ ను నిలిపివేసిన అధికారులు..కాలిపోయిన వైర్లను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దసరావేడుకల నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదం జరగడం పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకపు పనుల వల్లే షార్ట్ సర్య్కూట్ సంభవించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*