కేదార్‌నాథ్‌లో ఇంకా అస్థిపంజరాలు అలాగే….

skeletons-discovered-3-years-after-kedar-tragedy

ఘోరమైన ప్రకృతి వైపరీత్యం సంభవించిన మూడేళ్ల తర్వాత కూడా దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ లోయలో ఇంకా అస్థిపంజరాలు బయటపడుతున్నాయి. కేదార్‌నాథ్ 6 త్రియుగినారాయణ ట్రెక్ రూట్‌లో ఉత్తరాఖండ్ పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తగా అన్వేషణ చేపట్టాయి. ఈ వారం ప్రారంభంలో చేపట్టిన అన్వేషణలో పలు అస్థిపంజరాలు బయటపడ్డాయి. అంత్యక్రియలు చేయడానికి ముందు వైద్య నిపుణులు డిఎన్ఎ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్ పోలీసులు అస్థిపంజరాలను సామూహికంగా దహనం చేశారు. అస్థిపంజరాల సంఖ్య ఎంత అనేది కచ్చితంగా చెప్పలేమని, 20 వరకు ఉండవచ్చునని రుద్రప్రయాగ్ ఎస్పీ ప్రహ్లాద్ సింగ్ చెప్పారు. 2013లో ఉవ్వెత్తున వరదలు ఎగిసిపడిన సమయంలో కేదార్ ప్రాంతం నుంచి లక్షా పది వేల మందికి పైగా తరలించిన విషయం తెలిసిందే. అస్థిపంజరాలు బయటపడటం వల్ల రాష్ట్రానికి ప్రధాన ఆదాయమైన టూరిజం దెబ్బతినే అవకాశముందని బీజేపీ సహా పలు పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2013లో ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని మెరుపు వేగంతో వరదలు ముంచెత్తడంతో కేదార్ లోయలోనే దాదాపు 4 వేల మంది గల్లంతయిన విషయం తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*