బీజేపీ సోమిరెడ్డి ఆగ్ర‌హం

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి  మంగళవారం శాసనసభ మీడియా పాయింట్‌లో కొద్ది సేపు విలేకరు లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. శాసనసభ సమావేశాలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ప్రజాసమస్యల్ని సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, పరిష్కారం కనుగొనడం జరుగుతోందన్నారు. పలు కేసుల్లో నిందితునిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాని మోడీ 45 నిముషాలు ఆంతరంగిక సమావేశానికి అనుమతి నివ్వడంపై ప్రజలు ప్రశ్నించే పరిస్ధితులు వచ్చాయ న్నారు. దేశ వ్యాప్తంగా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌, శశికళ, మధుకోడా, నీరవ్‌మోడీ లాంటి వారు కూడా ప్రధానితో ఆంతరంగిక సమావేశం కావాలని అడుగుతున్నారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. రాజకీయపార్టీల సిద్ధాంతాలు మారిపోయి కొత్తపుంతలు తొక్కుతున్నాయన్నారు. సిఎం చంద్రబాబు ఉత్తర, దక్షిణ భారత దేశం అనడంలో తప్పులేదని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు.

ఓటుకు రెండు రాష్ట్రాల సిద్ధాంతాన్ని బీజేపీ మరోసారి తెర మీదకు తెస్తోందని, తాము చెప్పినట్టు చేయకుంటే ఏపీని మ‌రోసారి విడదీస్తామన్నట్టుగా ఆ పార్టీ నేత‌లు మాట్లాడుతున్నార‌ని సోమిరెడ్డి ఆరోపించారు.మ‌రోవైపు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీపై విశ్వాసం ఉందంటూనే, కేంద్ర ప్ర‌భుత్వం అవిశ్వాసం పెడ‌తామ‌ని వైసీపీ అంటోంద‌ని ఆయన అన్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీ ఏపీకి ద్రోహం చేస్తోందని ఆయ‌న మండిప‌డ్డారు. జ‌గ‌న్ లాంటి ఆర్థిక నేరగాళ్లకు మోదీ అపాయింట్‌మెంట్‌ ఎలా ఇస్తారని ఆయ‌న నిల‌దీశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*