చేపల చెరువుల తవ్వకాలను తక్షణమే నిలిపివేయలి

చేపల చెరువుల తవ్వకాలతో బీల భూములకు ముప్పు తప్పదని మానవ హక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వి.ఎస్‌.కృష్ణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని బీల భూములను పలు సంఘాల నాయకులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు.వందలాది ఎకరాల్లో చేపల చెరువులు తవ్వడం ద్వారా వేలాది ఎకరాల్లోని పచ్చని భూములు ముంపునకు గురవుతాయన్నారు. రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. బీలలో ఎటువంటి నిర్మాణాలూ చేపట్టకూడదని న్యాయస్థానాలిచ్చిన తీర్పులను సైతం ప్రభుత్వం, ఎన్‌సిసి యాజమాన్యం పెడచెవిన పెట్టాయన్నారు. ప్రజాప్రతినిధుల అండదండలతో కార్పొరేట్‌ శక్తులు విధ్వంసకర పరిశ్రమలను స్థాపిస్తున్నాయని విమర్శించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*