సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా పాకిస్తాన్ ఇవ్వాళ లైఫ్ అండ్ డెత్ మ్యాచ్ ఆడబోతోంది. తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఢీ కొట్టడానికి సమాయాత్తమౌతోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. అదృష్టం కొద్దీ సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన పాకిస్తాన్.. న్యూజిలాండ్‌తో ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది. న్యూజిలాండ్‌కు అతి పెద్ద అడ్డంకిగా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
ఎల్లుండి రెండో సెమీఫైనల్..
రెండో సెమీ ఫైనల్ గురువారం షెడ్యూల్ అయింది. అడిలైడ్ ఓవల్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే పోరు ఇది. ఈ రెండు జట్లు కూడా ఫైనల్ మ్యాచ్‌పై కన్నేశాయి. టైటిల్ హాట్ ఫేవరెట్స్‌గా టోర్నమెంట్‌లో అడుగు పెట్టాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. తొలి సెమీ ఫైనల్ విజేతతో ఈ నెల 13వ తేదీన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఫైనల్‌లో తలపడుతుంది.