డిఇఇ శ్రీనివాసరాజు పై ఎసిబి దాడులు రూ.20 కోట్ల ఆస్తుల గుర్తింపు

ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు సమాచారం రావడంతో శ్రీనివాసరాజు నివాసముంటున్న విశాఖలోని బాలయ్యశాస్త్రి లే అవుట్‌ ఆర్‌ఆర్‌ రెసిడెన్సీ అపార్టుమెంట్‌లో పాటు శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సోదాలు నిర్వహించారు. విశాఖలో ఐదు, పశ్చిమగోదావరిలో నాలుగు, శ్రీకాకుళంలో రెండు చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.12 లక్షల 52 వేల నగదు, 150 గ్రాముల బంగారం, కేజిన్నర వెండి, 32 ఎకరాల భూమి డాక్యుమెంట్లను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీతమ్మధారలోని 183 గజాల స్థలం, ఒక ఫ్లాట్‌ ఉన్నట్లు గుర్తించారు. గుర్తించిన ఆస్తుల విలువ రూ.కోటీ 50 లక్షలు వరకు ఉంటుందని, మార్కెట్‌ విలువ సుమారు రూ.20 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా..  దాడుల్లో శ్రీకాకుళం ఎసిబి అధికారులతో పాటు ఏలూరు ఎసిబి సిఐ కె.శ్రీనివాసరావు, పెనుగొండ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ వివివి.సత్యనారాయణ పాల్గొన్నారు. భీమవరం మండలం చిన అమిరంలోని శ్రీనివాసరాజు మావయ్య నారాయణరాజు, బావమరిది రామకృష్ణంరాజు ఇళ్లలో రాజమహేంద్రవరం ఎసిబి సిఐ సూర్యరామ్మోహన్‌రావు ఆధ్వర్యాన దాడులు జరిగాయి. దాడుల్లో శ్రీనివాసరాజుకు సంబంధించిన చెరువుల లీజు పత్రాలు, ఆస్తులకు సంబంధించి కొన్ని పత్రాలు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*