స్టీఫెన్ హాకింగ్ హఠాన్మరణం

ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఎంతో కాలంగా పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతూ చక్రాల కుర్చీకే పరిమితమైన ఆయన, కన్నుమూశారని కుటుంబసభ్యులు మీడియాకు వెల్లడించారు.ఆపై ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో బీఏ, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేశారు. హాకింగ్ రేడియేషన్, పెన్ రోజ్, హాకింగ్ ఫార్ములా, హాకింగ్ ఎనర్జీ, గిబ్సన్స్ – హాకింగ్ అన్సాట్జ్, ధ్రోన్ హాకింగ్ ప్రీస్కిల్ బెట్ వంటి ఆయన సిద్ధాంతాలు ఉత్సాహిక శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి.

ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో మరణించిన మూడు శతాబ్దాల తరువాత జన్మించిన స్టీఫెన్ ను భవిష్యత్తులో గెలీలియోను గుర్తు పెట్టుకున్నట్టుగానే మానవాళి గుర్తుంచుకుంటుందనడంలో సందేహం లేదు.
స్టీఫెన్ హాకింగ్ జీవితంలో ముఖ్య ఘట్టాలు…
* జనవరి 8, 1942న ఆక్స్ ఫర్డ్ లో జననం
* రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉండటంతో సురక్షిత ప్రాంతానికి తరలిన కుటుంబం
* ఆపై హైగేట్స్ ప్రాంతానికి వచ్చి విద్యాభ్యాసం
* గణిత శాస్త్ర విద్యపై స్టీఫెన్ ఆసక్తి… రసాయన శాస్త్రంలో చేర్పించిన తండ్రి
* 1959లో నేచురల్ సైన్స్ విద్య కోసం స్కాలర్ షిప్
* 1962లో తొలిసారిగా బయటపడిన అనారోగ్యం
* యూనివర్శిటీలో పరిచయమైన మహిళతో వివాహం
* ఇద్దరు మగపిల్లలు, ఓ ఆడపిల్ల జననం
* స్టీఫెన్ కు మోటార్ న్యూరాన్ వ్యాధి సోకినట్టు తేల్చిన వైద్యులు
* కనీసం బూట్ల లేస్ కూడా కట్టుకోలేని స్థితికి చేరిన స్టీఫెన్
* డాక్టరేట్ రాకుండానే మరణిస్తాడని తేల్చిన వైద్యులు… స్టీఫెన్ ఆత్మస్థైర్యం ముందు ఓడిన మృత్యువు
* తిరిగి వర్శిటీకి వచ్చి పరిశోధనలు మొదలు
* మొదటి భార్యతో విడాకుల తరువాత తనకు సేవలందిస్తున్న నర్సుతో వివాహం
* తన రోగాన్ని మరచిపోయి క్వాంటమ్ థియరీ సాయంతో బ్లాక్ హోల్స్ పై విస్తృత పరిశోధన
* 1984లో ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ పుస్తకంతో రచనలు మొదలు
* తొలి పుస్తకంతోనే ఎనలేని ఖ్యాతి… తెలుగులో ‘కాలం కథ’ పేరుతో విడుదల
* 1985 మరింత విస్తరించిన వ్యాధి, పూర్తిగా ఆసుపత్రికే పరిమితం
* మాట్లాడే కంప్యూటర్ ను ఒంటికి అమర్చుకున్న స్టీఫెన్
* అప్పటి నుంచి వర్శిటీలో ప్రొఫెసర్ గా, వ్యాసకర్తగా, ప్రసంగీకుడిగా లక్షలాది మందిలో స్ఫూర్తి నింపిన స్టీఫెన్ హాకింగ్
* ఆరోగ్యం పూర్తిగా విషమించి మార్చి 14, 2018… బుధవారం కన్నుమూత

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*