నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

stockmarkets-ends-the-day-low-banking-it-auto-shares-drag

వరుసగా రెండో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గురువారం సెన్సెక్స్ 114 పాయింట్లు నష్టపోయి 28,106 వద్ద ముగిసింది. నిఫ్టీ 34. పాయింట్లు నష్టంతో 8,709 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఆటో, ఐటీ, హెల్త్ కేర్ రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సీఎల్, అంబుజా సిమెంట్స్ షేర్లు నష్టపోయాయి. మరోవైపు మెటల్, అయిల్ అండ్ గ్యాస్ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. వేదాంత, హిందాల్కో, టాటా స్టీల్, హిందూస్థాన్ జింక్, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, రిలయన్స్, గెయిల్ ఇండియా షేర్లు లాభపడ్డాయి. కాగా ఐటీ రంగం షేర్లు నష్టపోయాయి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 66.67 వద్ద స్థిరపడింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*