సెన్సెక్స్ 400 పతనం, స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు

stockmarkets-sensex-plunges-over-400-points-nifty-below-8600

రెండు రోజులు వరుస సెలవుల తర్వాత తెరుచుకున్న దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. యూఎస్ ఫెడరల్ వడ్డీ రేట్లను పెంచే దిశగా చర్యలు మరియు చైనా మార్కెట్ల పతనం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. గురువారం సెన్సెక్స్ 439 పాయింట్లు నష్టపోయి 27,643 వద్ద ముగిసింది. నిఫ్టీ 135 పాయింట్లు నష్టంతో 8,573 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఆయిల్ మరియు గ్యాస్, ఆటోమొబైల్, హెల్త్ కేర్, ఐటీ రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడి భారీగా కనిపించింది. అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, లుపిన్, హిందూస్థాన్ యూనీలీవర్, భారతీ ఎయిర్ టెల్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ మరియు తదితర షేర్లు నష్టపోయాయి. రూపాయి విలువ 41 పైసలు పతనమైంది. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 66.91 వద్ద స్థిరపడింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*